మా కెన్నడీ హై ద గ్లోబల్ స్కూల్ నందు తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజా కవి పద్మవిభూషణ్ గ్రహీత కాళోజీ నారాయణరావు గారి జయంతిని పురస్కరించుకొని జరిగే ఈ వేడుకలకు స్కూల్ ప్రెసిడెంట్ సర్ బి. సుబ్బారెడ్డి గారు, మేనేజింగ్ డైరెక్టర్, కమాండర్ ఎన్. కృపాకర్ రెడ్డి గారు, అకడమిక్ డైరెక్టర్ అండ్ సీనియర్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మీ భట్ గారు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
స్కూల్ ప్రెసిడెంట్ బి. సుబ్బారెడ్డి గారు అధ్యక్షత వహించారు. దీప ప్రజ్వలన, ప్రార్థన అనంతరం సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ తెలుగు భాష ప్రాచీనమైనదనీ, తెలుగు భాష స్పష్టమైన ఉచ్చారణ కలిగినటువంటి భాష అనీ, అన్య భాషా పదాలకు తావు ఇవ్వకుండా మాట్లాడటం నేర్చుకోవలసిన ఆవశ్యకత ఉందని విద్యార్థులకు సూచించారు. మేనేజింగ్ డైరెక్టర్, కమాండర్, ఎన్. కృపాకర్ రెడ్డిగారు మన మాతృభాష అంటే కేవలం మాటల సమాహారమే కాదు, మన భావోద్వేగాలకు, సంస్కృతి సంప్రదాయాలకు, జీవన విధానానికి ప్రతిబింబం అని తెలియపరిచారు.
అకడమిక్ డైరెక్టర్ అండ్ సీనియర్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మీ భట్ గారు ప్రసంగిస్తూ తెలంగాణ యాస సంస్కృతానికి దగ్గరగా ఉంటుందని ఎన్ని భాషలు నేర్చినా, ఎంత ఉన్నత స్థితికి వెళ్లినా, మన మాతృభాషను, మాతృ దేశాన్ని మాతృమూర్తిని మరువ వద్దనీ విద్యార్థులకు సూచించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి.