కెన్నెడీ హై ది గ్లోబల్ స్కూల్ తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు
మా కెన్నెడీ హై ది గ్లోబల్ స్కూలులో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కళోజీ నారాయణరావు గారు జయంతిని పురస్కరించుకుని జరిగే ఈ వేడుకలకు స్కూల్ చైర్మన్ సర్ శ్రీ యస్. జమలారెడ్డి గారు, డైరెక్టర్ సర్ శ్రీ యమ్. సుబ్బారెడ్డి గారు, ప్రిన్సిపాల్ మేడమ్ శ్రీమతి రాజ్యలక్ష్మి భట్ గారు, ఉపాధ్యయ మరియు ఉపాధ్యయినీ బృందం, విద్యార్థినీ, విద్యార్దులు పాల్గున్నారు. అక్షయ, లాలస అనే విద్యార్థినులు ఈ కార్యక్రమాన్ని అసాంతం నిర్వహించగా , స్కూల్ చైర్మన్ శ్రీ జమలారెడ్డి గారు అధ్యక్షత వహించారు. దీప ప్రజ్వలన, ప్రాధాన అనంతరం ముందుగా శ్రీ చైర్మన్ సర్ తెలంగాణ యాస కోసం తెలుగు భాష కోసం పరితపించిన ప్రజాకవి, కళోజీ నారాయణ రావు గారు గురుంచి మరియు తెలంగాణ భాష అత్యంత ప్రాచీనమైనదని, తెలుగు ఏOత పురాతన వారసత్వ
సంపద్విలసితమో తెలంగాణ భాష సైతం ప్రాక్తన భాస్వOత భాష అని ప్రశంగించారు. స్కూల్ ప్రిన్సిపాల్ మేడమ్ గారు తెలంగాణ భాషా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. తెలుగు ఉపాధ్యయిని కళోజీ నారాయణరావు గారు వ్యకితO గురుంచి తెలిపారు. అ తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఇందులో భాగంగా విద్యార్థినీ విద్యార్దులు ప్రదర్శించిన తెలంగాణ కవులు "కవి సమ్మేళనంలో " వారు చెప్పిన పద్యాలకు చూపరులు అశ్ఛర్య చకితులైనారు. తదనంతరం తెలుగు ఉపాధ్యయిని శ్రీమతి రాఘవమ్మ గారు వందన సమర్పణ చేయగా జనగణ మన గీతంతో కార్యాక్రమం దిగ్విజయంగా ముగిసింది.